[వి డ్రీమ్స్ ప్రత్యేకం]
భూ ఆక్రమణలు, టైటిల్
గొడవలు, మ్యుటేషన్లు, అసైన్మెంట్లు, 22a, రీసర్వే లోపాలు, తప్పులు తడకల రికార్డులు తదితర భూ, రెవెన్యూ, సర్వే సమస్యలన్నింటినీ మూడు నెలల్లో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్ లైన్ పెట్టారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక ప్రహసనంగా మారిన విషయం ప్రజా సర్వేల్లో స్పష్టమైంది. అర్జీలన్నీ బుట్ట దాఖలు చేసి కాసులు ఇస్తేనే పనులు [క్యాష్ అండ్ క్వారీ] అన్న పద్ధతిలోనే రెవెన్యూ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వం మారినా పీడన పోలేదు.
రెవెన్యూ అధికారుల అవినీతి మహమ్మారి గా మారి అధికార కూటమి ప్రతిష్టను గట్టిగా దెబ్బతీస్తోంది. దీంతో స్వయంగా సీఎం ఈ వ్యవస్థ ప్రక్షాళనకు పూనుకున్నారు.
ఐఏఎస్లు సైతం బరితెగించి భారీగా లంచాలు మెక్కడం సిట్ ల ద్వారా బయటపడింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ బ్రోకర్లకు రెవెన్యూ సెటిల్మెంట్లు కోట్లు కురిపిస్తున్నాయి. చిన్నాచితక రైతుల నుంచి సైతం కనికరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం వేలల్లో లక్షల్లో సొమ్ము పిండుతోంది.
ఈ పరిస్థితికి తెరదించాల న్న చంద్రబాబు ప్రయత్నం నెరవేరు తుందా లేదా మరో కొత్త పథకం ప్రకటించి ప్రక్షాళనకు మంగళం పాడేస్తారా….వేచి చూడాల్సిందే. ప్రభుత్వ ఉత్తర్వులను హుష్కాకి అనేయగల శక్తి రెవెన్యూ యంత్రాంగానికి ఉంది మరి. మార్పు తేవాలంటే సంస్కరణలు సాంకేతికత సాయం, చిత్తశుద్ధి అవసరం.
తిరిగి ఆర్డీవో కోర్టులు :
రెవెన్యూ కోర్టులను ఆర్డీవోల పరిధి నుంచి తప్పించి జిల్లా రెవెన్యూ అధికారికి కట్టబెట్టిన ఉత్తర్వులఉపసంహ రణకుప్రభుత్వం హామీ ఇచ్చింది. జిల్లా రెవెన్యూ అధికారి పరిధిలోకి రెవిన్యూ కోర్టులను మార్చడం వలన ఎదురవుతున్న సమస్యలను వ్యవసాయ భూ సమస్యల అధ్యయన వేత్త పిఎస్ అజయ్ కుమార్ తదితరులు రెవెన్యూ కార్యదర్శి సిసోడియా దృష్టికి తెచ్చారు. సిసోడియా వెంటనే స్పందించి రెవెన్యూ అప్పీల్ కోర్టు లు ఆర్డిఓ పరిధిలోకి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకున్నారు
పారదర్శకత, సమర్థ భూపాలన
అన్ని పెండింగ్ భూ సంబంధిత సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామ నీ పారదర్శకత సమర్థ భూపాలన పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తామని రెవెన్యూ ( భూములు) ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా కూడా ప్రకటించారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్లకి ఈ బాధ్యత లను అప్పగించామని కూడా ఆయన చెప్పారు. అన్ని రెవెన్యూ సమస్యల పరిష్కా రం లో జవాబుదారీతనం, సత్వర అమలకు ప్రాధాన్యం ఇస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి కూడా చెప్తున్నారు. వెబ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ హౌస్ సైట్స్ రెవెన్యూ సమస్యల పరిష్కారం ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి.
ఎంట్రీలలో తప్పులకు చెల్లు చీటీ
రెవెన్యూ రికార్డులు, సర్వే రికార్డులు తదితర రికార్డులలో నమోదు ల్లో తప్పులుంటే అందుకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు డిజిటల్ ల్యాండ్ మేనేజ్మెంట్ పద్ధతులు మెరుగుపరచడం పై దృష్టి కేంద్రీకరించారు.
అయతే……..
జిల్లాల్లో జరుగుతున్నది ఏమిటి?
రెవెన్యూ సమస్యల పరిష్కారం లో తహసిల్దార్లు నాన్చుడు వైఖరికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నెలల తరబడి సమస్యలను పరిష్కరించడం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయము కు బదులు తహసిల్దార్, సచివాలయాల్లో కూడా అర్జీలను సమర్పించవచ్చు. అయితే తాసిల్దార్ కార్యాలయాలు సచివాలయాల్లో సమర్పించడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు అర్జీలు నమోదు లో జవాబుదారీ త నం లోపాలు కూడా కారణం. కలెక్టర్ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాల యా ల్లోపంపే అర్జీలు బీరువాల్లో మగ్గటమే తప్ప వాటికి సరైన ఎండార్స్మెంట్లు ఇవ్వరు. తీసుకొన్న చర్యలు పై కలెక్టర్ కు నివేదిక ఇవ్వరు. జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు సమీక్షలు చేయరు స్పందించరు. పై తాసిల్దార్ కార్యాల యాల్లోపెండింగ్ అర్జీల పై సమీక్ష నిర్వహించడం లేదు. ఫైల్ స్టేటస్ ను ఎవరూ ట్రాక్ చేయరు.
ఇలా ఉంది
రెవెన్యూ పాలన
మరి మూడు నెలల్లో సమస్యలను ఎలా పరిష్కరిస్తారో!
