వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఈ నెల 27 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరచిన ఉత్తరాంధ్ర ఏపిటిఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్పాస్టెక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం ఇక్కడి రింగు రోడ్డు లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతుడు అయన పాకలపాటి రఘు వర్మ ని కూటమి ప్రభుత్వం బలపరచిందని అన్నారు. ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అందుబాటులో లేకపోవడం వలన ఈ సమావేశానికి హజరు కాలేక పోయారని అన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి సీరియల్ నెంబరు 7 ఎదురుగా నిలువు గీత పెట్టి రఘు వర్మ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ణాప్తి చేసారు. అలాగే బ్యాలెట్ పేపర్ లో ఓటు వెయ్యడానికి ఎన్నికల అధికారి ఇచ్చే పెన్ను ని మాత్రమే వాడాలని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి మొతగ 2885 ఓట్లు ఉన్నాయని అనకాపల్లి నియోజకవర్గం వచ్చేసరికి 663 ఓట్లు నమోదు అయ్యాయని పీలా గోవింద అన్నారు. అనకాపల్లి పట్టణం లో ఒకటి కశింకోట లో ఒకటి పోలింగ్ బూతులు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీర్మానం చేసిన బిల్లులు ఎగువ సభలో కూడా ఆమోదించవలసి ఉందని అందువల్ల రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వం బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో 82 వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పోలవరపు త్రిన్నాధ్,80 వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ బిఎస్ఎంకె జోగి నాడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలం శెట్టి నీలబాబు,కర్రి బాబు,తెలుగు మహిళల అధ్యక్షురాలు కొణతాల క్రిష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
