వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన గవ్వ బాబురావు భార్య గవ్వ వీరలక్ష్మికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు వేతనం మరియు ఇతర ఆర్థిక సహాయం కలిపి మొత్తం రూ. 4,12,140/- ను చెక్ రూపంలో అందజేశారు.
ఈ చెక్కును అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తన కార్యాలయంలో గవ్వ వీరలక్ష్మికి అధికారికంగా అందజేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులలో విధి నిర్వహణలో మరణించిన లేదా పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో పనిచేస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు
ఏ.రామ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
