వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఉపాధ్యాయ నియోజకవర్గం శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం శాసనమండలి ఎన్నికలు తేది.27.02.2025న శుక్రవారం ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జరుగనున్న సంధర్బంగా అనకాపల్లి జిల్లా అధికార పరిధిలో 25.02.2025 నుండి 28.02.2025 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 163 ప్రకారం పోలింగు ముగిసే సమయానికి 48 గంటల వ్యవధిలో సమావేశాలు మరియు బహిరంగ సభలను నిర్వహించడంపై నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కిృష్ణన్ తెలియజేసారు. భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 189(1) ప్రకారం చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని తెలిపారు. లౌడ్ స్పీకర్ను ఉపయోగించడానికి అనుమతించబడదని, జిల్లా లో ఏదైనా పోలింగ్ స్టేషన్కు (పోలింగ్ స్టేషన్లో క్యూలో ఉన్న ఓటర్లు మినహా) 200 మీటర్ల పరిధిలో 5 మంది కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విదించబడినదని జిల్లా కలెక్టరు తెలిపారు. పై ఆదేశాలను ధిక్కరిస్తే భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 223 కింద మరియు అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం శిక్షార్హమైన చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు.
