జిల్లాను ప్రమాద రహిత పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దాలిజిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలు, నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. జె.ఎన్.పి.సి. పరవాడ లోగల ఎంఎఎస్ఆర్ఎం నందు ఫ్యాక్టరీలలో భద్రత ప్రక్రియ పై మంగళవారం జరిగిన వర్కుషాపుకు జిల్లా కలెక్టరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం నకు హాజరైనటువంటి వివిధ ఫ్యాక్టరీల ప్రతినిధులను ఉద్దేశించి జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో తీసుకోవలసిన భద్రతా చర్యలు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. అనకాపల్లి జిల్లా పారిశ్రామిక హబ్ గా అభివృద్ది చెంది, ఎటువంటి ప్రమాదం జరగకుండా ‘జీరో యాక్సిడెంట్’ నినాదంతో ప్రతి యాజమాన్యం పనిచేయాలని సూచించారు. ఫ్యాక్టరీ, కార్మికుల భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కార్మికుడు కలిసికట్టుగా యాజమాన్యంతో సహకరించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ భద్రతా ప్రక్రియ (ప్రోసెస్ సేప్టీ) లో భాగంగా ప్రతి కెమికల్ ఫ్యాక్టరీ నందు జరుగుచున్న ప్రక్రియ పై వివిధ ప్రమాదాల గుర్తింపు అధ్యయనాలు

చేయించి వాటికి తగు విధమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటుచేయాలని తెలిపారు. మరియు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకుని ఆ ఫ్యాక్టరీలో పనిచేసే మిగతా కార్మికులకు వాటిని వివరించి, భద్రతా చర్యలను పటిష్ట పరచుకోవలసినదిగా కోరారు. అనకాపల్లి జిల్లాను ప్రమాద రహిత పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దాలని పరిశ్రమల యాజమాన్యానికి తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు JNPC సెక్రెటరీ శ్జెట్టి సుబ్బారావు, ఎస్.ఓ.హెచ్.ఎస్ ప్రెసిడెంట్ రామ్ సుబ్బారావు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, విశాఖపట్నం జే.శివశంకర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, విజయనగరం జీ.వీ.వీ.ఎస్ నారాయణ, అచ్యుతాపురం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్నే ప్రసాద్, వివిధ ఫ్యాక్టరీల ప్రతినిధులు, సుమారు 170 మంది మరియు సేఫ్టీ నిపుణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *