వీ డ్రీమ్స్ కలెక్టరేట్
భూ యజమానులకు, సర్వే సిబ్బంది మరియు రెవిన్యూ సిబ్బందికి, రి-సర్వేలో వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో జిల్లా సర్వే మరియు భూమి” రికార్డుల కార్యాలయము, కలక్టరు ఆఫీసు, అనకాపల్లి నందు రీ-సర్వే నిపుణుల సెల్ ( Re-Survey Expert Cell) ఏర్పాటు చేయడమైనదని జాయింటు కలెక్టరు ఎమ్. జాహ్నవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎ.పి. రీసర్వే ప్రోజెక్టులో భాగంగా పైలెట్ ప్రోజెక్టుగా మండలానికి ఒక గ్రామంచొప్పున రీ-సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రీసర్వేలో సందేహాల నివృత్తికి ఏర్పాటుచేసిన సెల్ కు రీ-సర్వే నిపుణుల సెల్ ( Re-Survey Expert Cell) అధికారిగా సర్వే ఇనస్పెక్టరు ఎం.ఆర్.పి. బాబును నియమించడం జరిగిందని, సందేహాలు నివృత్తి చేయడానికి 9121622335 నెంబరులో కార్యాలయ పనిదినాలలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భూ యజమానులు, సర్వే సిబ్బంది మరియు రెవిన్యూ సిబ్బంది రి-సర్వేలో వచ్చిన సందేహాలు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకో వచ్చునని జాయింటు కలెక్టరు తెలిపారు.
