వీ డ్రీమ్స్ అనకాపల్లి
కొండుపాలెం గ్రామంలో శనివారం రీ సర్వే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో అనకాపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి రమేష్ , పాపయ్య పాలెం సచివాలయ సర్వేయర్ రామలక్ష్మి మాట్లాడుతూ రైతులు అందరూ రీ సర్వే కు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు
అనకాపల్లి జిల్లాలో ఎంపిక చేసిన 24 గ్రామాల్లో రెవెన్యూ రీ సర్వే 20 నుండి ప్రారంభం కానుంది. రే సర్వే పై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో 24 గ్రామాలను పైలట్ గ్రామాలుగా గుర్తించి కూటమి ప్రభుత్వం రీ సర్వే ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇంతవరకు రీ సర్వే కు నోచుకోని మిగతా గ్రామాల్లో కూడ దశలు వారీగా రీ సర్వే పూర్తి చేస్తారు. రైతుల పేర్లు,సర్వే నెంబర్లు ఇతర వివరాలు ఎక్కడా తప్పులు లేకుండా పూర్తి సమాచారంతో పకడ్బందీగా సర్వే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ గ్రామాల్లో ఈ నెల 20 నుండి రీ సర్వే చేపడతారు.
