వీ డ్రీమ్స్ ప్రత్యేకం
గత ఏడాది రీ సర్వే జరిగిన గ్రామాల్లో రీ సర్వే లోటుపాట్ల పై అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఉపక్రమించింది.రీ సర్వే రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి తహసీల్దారు లు అర్జీ లను స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిని 45 రోజుల్లో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హమి ఇచ్చింది. అంతే గాక మొబైల్ మెజిస్ట్రేట్ టీం లను నియమించి అపీళ్లను విచారిస్తామనికూడా హమి ఇచ్చింది. అయితే ఈ పని ప్రారంభించకుండా పైలట్ గ్రామాల్లో రీ సర్వే మొదలు పెట్టింది. ఉన్న సిబ్బంది అంతా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. రీ సర్వే తప్పుల సవరణ మాటేమిటని అన్ని ప్రాంతాల నుండి విమర్శలు రావడం తో రీ సర్వే తో పాటు సవరణ అర్జీ లను కూడ విచారణ మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్జీ లు అన్నింటినీ పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ లో నమోదు చెయ్యాలని 75 రోజులు గడువు లోగా పరిష్కరించాలని ఉత్తర్వులు ఇచ్చింది పైలట్ పైలట్ రీ సర్వే గ్రామాలలో పనిచేస్తున్న వారు కాక మిగతా సర్వేయర్ లు ,విఆర్ఒ లు ఈ పనిలో నిమగ్నం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
