ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికైకేంద్ర ప్రభుత్వం 50వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించాలి : సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ

వీ డ్రీమ్స్, అనకాపల్లి
.
ఈరోజు అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించాం. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 1, 2 ,3 తేదీల్లో నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఈ మహాసభల్లో ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై చర్చించనున్నారని, కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు కేటాయింపు చేయలేదని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ప్రారంభం చేయకపోవడం వలన ఉత్తరాంధ్రలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాల భూములకు సాగునీరు లేకుండా పోయాయని, ఉత్తరాంధ్రలో సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, 2047 విజన్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తామని చెబుతామన్నారని, ఈరోజు ఉత్తరాంధ్రలో సముద్రతీర ప్రాంతం అంతా కాలుష్యకారక పరిశ్రమలతో నిండిపోతుంది. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర స్మశాన దిబ్బగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, గిరిజన ప్రాంతంలో పంపుడ్ స్టోరేజ్ పేరుతో ఆదానీ విద్యుత్ సంస్థలకి కట్టబెడుతున్నారని, మైదాన ప్రాంతంలో సముద్ర తీరం ప్రాంతం మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని. వస్తున్న పరిశ్రమల్లో ఎక్కడా కూడా స్థానికులకి ఉపాధి కల్పించడం లేదని. లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు సొంతగనులు కేటాయించకుండా ప్యాకేజీలతో సరిపెట్టేస్తున్నారని, పరిశ్రమ ప్రారంభం కాకుండానే మిట్టల్ స్టీల్ కంపెనీకి ఏపీఎండిసి తో ఐరన్ ఓర్ కి ఒప్పందం చేశారని, ప్రభుత్వ రంగ పరిశ్రమ స్టీల్ ప్లాంట్ కు మాత్రం గనులు ఇవ్వడం లేదని, అనకాపల్లి జిల్లా లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరణ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారని, నేటీకి షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ పనులే ప్రారంభం కాలేదని, నేటికీ మత్స్యకారులకు వేట నిషేద భృతి చెల్లించలేదని, రైతు బరోసా అమలు చేయలేదని, జిల్లా సమగ్రభివృద్ధికి భవిష్యత్తు పోరాటాలకు సిపిఎం రాష్ట్ర మహాసభలులో చర్చిస్తామని అన్నారు. ఈ పత్రికా సమావేశం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, గంటా శ్రీరామ్, ఎం అప్పలరాజు, అర్. శంకర్రావు, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లిలో జరిగిన సిపిఎం జిల్లా సమావేశంలో మాట్లాడుతున్న లోకనాథం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *