వీ డ్రీమ్స్ కసింకోట
రాజీనామాలు సమర్పించి ఎన్నికల ప్రచారంలో దిగుతున్న వాలంటీర్లలో చాలామంది తమను అనవసరం గా రాజకీయ ఊ భి లోకి లాగారని మదన పడుతున్నారు.ఆదాయం తక్కువే అయనప్పటికీ ఉన్న చోటనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సాఫీ గా సాగుతున్న ఉపాధి ని దెబ్బతీయడమే అని వారు వాపోతున్నారు.
కశింకోట మండలం లో రాజీనామాలు సమర్పించిన పలువురు వాలంటీర్ల మనోగతమిది.అధికారపార్టీ నాయకుల తీవ్ర వత్తిడి కారణం గానే మూకవుమ్మడి రాజీనామాలు ఇచ్చామని,అంటూ
ఒకే విధంగా ఉన్న ప్రింటెడ్ రాజీనామపత్రాలను చూపిస్తున్నారు.వీటిని వైసీపీ
నాయకులే తమకు ఇచ్చి వాటిపై సంతకాలు చేయించారని వెల్లడించారు.
ఎన్నికల ప్రచారం లో పాల్గొనాలని, డేటా ను అందజేయాలని నాయకులు చెప్పారని, కొన్నిచోట్ల బహుమతులు అందజేశామని మీ సేవలకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు.కొందరు వాలంటీ ర్లను ఎంపిక చేసి వారిచే ఓటర్లకు సొమ్ము పంపిణీ చేసెందుకు వారిని సిద్ధం చేస్తున్నారని ఒక మహిళా
వాలంటీర్ చెప్పారు.
అయితే ఒకరిద్దరు తప్ప మిగతా వారు ఇలాంటి పనులు చేపట్టడానికి భయపడుతున్నారు.
ప్రతి పక్ష పార్టీల నాయకులు తమను పోలీసులకు పట్టించినా, హింసించినా తమను కాపాడేందుకు ఎవరూ రారని , తమను ఈ రాజకీయ రొంపి లోకి దింపవద్దని అంటున్నారు.
అరెస్టులు,కేసులు నమోదవడం వంటివి జరిగితే
తమకు ముందుముందు ఉద్యోగాలు దొరకవని,భవిష్యత్ నాశనమవుతుంది అని భయపడుతున్నారు.
వీరికి నచ్చచెప్పి ప్రచారం లో దింపడానికి వైసీపీ నాయకులు తంటాలు పడుతున్నారు .రాజీనామా చేసినా గత 5 ఏళ్ళ సర్వీస్ పోకుండా చేస్తామని
తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే మంచి జీతం పై తిరిగి వాలంటీర్ పోస్ట్ లు ఇస్తామని నచ్చ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా గ్రామాల్లో వాలంటీర్లకు పార్టీ పనులు అప్పచెప్పడం,వారికే పెత్తనం ఇవ్వడాన్ని గ్రామస్థాయి నాయకులు వైసీపీ సర్పంచులు సహించలేక పోతున్నారు.