వీ డ్రీమ్స్ అమరావతి
ఒక సారి కాదంటూ మరో సారి అవునంటు …ఎట్టకేలకు రీ సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుండి కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
గ్రామం ఒక యూనిట్ గా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి రీ సర్వే ను నిర్వహిస్తారు.
ఇలా ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ప్రారంభమయ్యే రీ సర్వే లో ఎలాంటి అవకతవకలకు, పొరపాట్లకు తావివకుండ పకడ్బందీ గా నిర్వహిస్తారు. గత ప్రభుత్వ హయాంలోలోజరిగిన రీసర్వే తప్పుల తడక గా తయారైంది. ఇలాంటి పరిస్థితి దాపురించకుండ రీ సర్వే జరిగే గ్రామాల్లో తగినంత మంది సర్వే యర్లను, ఇతర సిబ్బందిని నియమిస్తారు
20వ తేదీ నుంచి నిర్వహించే రీసర్వేకు ముందుగా ప్రతి రైతుకు నోటీసు జారీ చేస్తారు.గ్రామాన్ని 200 నుంచి 250 ఎకరాల బ్లాకులుగా విభజిస్తారు. ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి 3 నుంచి 4 బృందాలను కేటాయించాలని, ప్రతి బృందంలో ఇద్దరు విలేజ్ సర్వేయర్లు, ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఒక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉంటారు. ఈ బృందాలతో పాటు ఆ గ్రామంలో పని చేస్తున్న ఒక విలేజ్ సర్వేయర్ ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్‌తో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని నియమిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్ల సర్వే అధికారి, ఆర్‌ఎస్‌డీటీ, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొంటారు.
అనకాపల్లి జిల్లాలలో…
అనకాపల్లి జిల్లాకి సంబందించి24 మండలాల్లో 24 గ్రామాలను పైలట్ గ్రామాలను ఎంపిక చేసారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెల 20 నుండి రీ సర్వే చేపట్టనున్నారు.అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి మండలం లో కొండుపాలెం,అచ్యుతాపురం మండలం జంగులూరు,బుచ్చెయ్యపేట మండలం బుచ్చెయ్యపేట, దేవరాపల్లి మండలం తెనుగుపూడి,కె.కోటపాడు మండలం దల్లివలస,కశింకోట మండలం తీడ,మునగపాక మండలం నరేంద్ర పురం,పరవాడ మండలం స్వయంభు వరం, రాంబిల్లి మండలం లాలంకోడూరు,సబ్బవరం మండలం గుల్లేపల్లి,యలమంచిలి మండలం బయ్యవరం, చీడికాడ మండలం చీడికాడ,గొలుగొండ మండలం గుండుపాల,కోటవురట్ల మండలం చిన్న బొడ్డేపల్లి,మాడుగుల మండలం దిగ్గలపాలెం,మాకవరం మండలం పైడిపాల,నర్సీపట్నం మండలం వేములపూడి,నాతవరం మండలం పెద భైరవ భువతి అగ్రహారం, నక్కపల్లి మండలం గుల్లిపాడు,పాయకరావుపేట మండలం శ్రీ రాంపురం, రావికమతం మండలం దొండపూడి,రోలుగుంట మండలం రామన్నపేట, యస్ రాయవరం మండలం కర్రివానిపాలెం గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నారు.
