వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి జిల్లా రెవెన్యూ శాఖ లోని అవినీతి, అక్రమాలు విధుల పట్ల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం వంటి జాడ్యాలనువదల గొట్టేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ పూను కో వలసి ఉంది.మొక్కుబడి హెచ్చరికలు, చూసి చూడ నట్లు వదిలేయడం,సూపర్ ఎమ్మెల్యే లకు అవినీతి రాంబందుల్లా తయారైన అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం కొనసాగితే పాలనకు గట్టి దెబ్బ తగులుతుందని వస్తున్న విమర్శలను కలెక్టర్ పట్టించుకొనక పోతే రెవెన్యూ శాఖ పూర్తి గ దిగజారి పోతుంది.
ప్రభుత్వం మారినా మండలాల్లో
భూ దందా కొనసాగుతూనే వుంది. అనకాపల్లి తాలూకా ఆఫీస్ లో ఓ అధికారి రాజికీయ అండదండలతో ఉన్నతాధికారుల ఉదాసీనత తో రికార్డ్స్ ను మార్చేస్తున్నారు. కబ్జా దారులకు భూములను దోచి పెడుతున్నారు. లాండ్ పూ లింగ్ అక్రమాలు, ఇళ్ళ స్థలాలు, భూముల కబ్జాలు
దొంగ పట్టాలు జారీ, గ్రావెల్ మట్టి ఇసుకల అక్రమ తరలింపు మూడు పువ్వులు ఆరు కాయలు గా సాగుతున్నది.
ప్రజా సమస్య ల పరిష్కారం
ఇదేనా?
కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ ద్వారా కలెక్టర్ కి మొరపెట్టు కున్న అర్జీదారులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఈ అర్జీలు పరిష్కారం పై తహశీల్దార్ల తో
జెసి సమీక్షలు చేయడం లేదు.
పిజిఆర్ఎస్ లో అనకాపల్లి జిల్లా అధమం గా ఉందని సీఎం వ్యాఖ్యానించిన జిల్లా అధికారులకు చీమ కుట్టినట్లు లేదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక మొక్కుబడిగా కొనసాగు తుంది. ప్రతివారం కలెక్టర్ హెచ్చరికలే తప్ప అర్జీ దారుల గోడు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అర్జీలపై మండలాలు వారీగా ఒక్క సమీక్ష నిర్వహించలేదు.అర్జీల డేటా కలెక్షన్ కే పాలన పరిమితం అయ్యింది. మండల రెవెన్యూ కార్యాలయాలకు జెసి సందర్శించ రని రాష్ట్ర భూ పాలనాధికరి కి పిర్యాదులు వెళ్లాయికూడా.
రెవెన్యూ అర్జీలకు కనీసం రశీదు లైనా ఇవ్వాలంటూ ఆదివాసీ సంఘాలు ర్యాలీలు నిర్వహించవలసి వచ్చింది. గ్రీవియెన్స్ అర్జీల్లో చిన్న చిన్న సమస్యలకు సమాధానం దొరకదు. గడువు ముగిసినా అతిగతి ఉండదు.అర్జీ దారులు పదేపదే కలెక్టరేట్ కు కాళ్లరిగేలా తిరగవలసి వస్తోంది. దారుణమైన ఈ పరిస్థితిని కలెక్టర్, జెసిలు నివారించాలి. అర్జీల పరిష్కారం ద్వారా భూ కుంభకోణాలు నివారించవచ్చు.
నిఘా కరువు
అనకాపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలపై తెలుగుదేశం నాయకులు బహిరంగ సమావేశంలో ఆధారాలతో సహ దండెత్తారు. జనసేన షాడో నాయకుడు జోక్యంతో కలెక్టర్ తిరిగి ఆ అధికారికి పెద్ద పీట వేస్తున్నారు. తహసీల్దారు నిబద్ధత కల అధికారి కావడంతో పరిస్థితి కొంత అదుపులో ఉంది.
వైసీపీ హయాంలో మంత్రి బూడి
చెప్పి నట్టు ఆడి చెలరేగిన ఇద్దరు తహశీల్దార్ల ను కూటమి ప్రభుత్వం కలెక్టరేట్ లో కీలక స్థానాల్లో నియమించింది.
అనకాపల్లి మండలం పిసినికాడ శివారు బిఆర్టీ కాలనీ లో రెవెన్యూ సర్వే నెంబరు 362-5,6లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడని బిఆర్టి కాలనీ ప్రజలు రెవన్యూ అధికారులకు పలుమార్లు పిర్యాదులు చేసారు. రెండు ఏళ్ల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నా ఆక్రమించుకున్న భూమిని ఇంత వరకు స్వాధీనం చేసుకోకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆక్రమణ దారుడుకి రెవెన్యూ అధికారి ఒకరు అండగా ఉంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్పు రావాలి
కలెక్టర్ ఇటీవల అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో డాక్టర్ల అవినీతి భాగోతంపై దృష్టి పెట్టి వారి ఆట కట్టించే ప్రయత్నం చేసారు. అక్కడ డాక్టర్ ఒకరిని సస్పెండ్ చేసారు. మీడియాలో వచ్చిన కధనం ఆధారంగా కలెక్టర్ స్పందించిన తీరు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాక ఇష్టం రాజ్యంగా వ్యవహరించే అధికారులు, ఉద్యోగులు కు చెమటలు పట్టించాయి
కలెక్టర్ ఇదే చొరవ తన రెవెన్యూ
శాఖ విషయం లో చూపితే
రైతుల సమస్యలు తీరుతాయని ప్రజా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.
ప్రభుత్వం ఐ వీ ఆర్ ఎస్ ద్వారా సేకరించిన సమాచారం లో అనకాపల్లి జిల్లా రెవెన్యూ అవినీతి బయటపడింది. దీంతో వెబెక్స్ సమావేశం నిర్వహించి కలెక్టర్ రెవెన్యూ సర్వే ఉద్యోగులను హెచ్చరించారు.
కలెక్టర్ ఇంతటి తో సరిపెడితే
ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదు.షాడో ఎమ్మెల్యే లు
లంచ గొండి అధికారులు కోసం ప్రజలను పాలనను గాలికి వొదేలే స్తారా ??? అని వివిధ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
