వీ డ్రీమ్స్ మునగపాక
మాజీ పార్లమెంట్ సభ్యులు
దివంగత “పెతకంశెట్టి అప్పలనరసింహం
89వ జయంతి వేడుకల్లో భాగంగా పెతకంశెట్టి అప్పలనరసింహం విగ్రహానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెద్దలు అందరూ అప్పలనరసింహం అనకాపల్లి ఎంపీ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి సేవలను కొనియాడారు. మునగపాక టిడిపి మండల పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు తనయులు మౌర్య* విశాఖ 89వ డివిజన్ కార్పొరేటర్ దాడి రమేష్ నాయుడు మరియు కుటుంబం మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
