వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లిలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు రక్తదాన శిబిరం, ప్రతిభా పురస్కారాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంక్షేమం, వారిలో సేవా స్ఫూర్తి మరియు పరస్పర సౌహార్దాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ కూడా రక్తదానం చేసి ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించే సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు విస్తృత సేవా మరియు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు రెవెన్యూ ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించేలా.. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ గారి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. పిల్లల భవిష్యత్తుకు తలిదండ్రుల కష్టం ఎంతగానో తోడ్పడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం గత ఏడాది కాలంలో పదవీ విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగుల సేవలను ఈ వేదికపై ప్రత్యేకంగా కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి సేవలందించిన మాజీ ఉద్యోగుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ అండగా ‘చిరు సాయం’ విధుల నిర్వహణలో ఉంటూ దురదృష్టవశాత్తూ మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలను ఈ వేడుకల్లో గుర్తుంచుకున్నారు. వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ, కలెక్టర్ గారి చేతుల మీదుగా చిరు ఆర్థిక సహాయాన్ని అందజేసి, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ వారిచే నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, సిబ్బంది మరియు ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



