అనకాపల్లిలో భారీగా గంజాయి పట్టివేత స్వాధీనం చేసుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులు

వీ డ్రీమ్స్ అనకాపల్లి

:అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయగడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు లారీ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1353 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. . సుమారు ఆరు కోట్ల రూపాయలు విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విశాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అనకాపల్లి జిల్లా మర్రిపాలెం టోల్ గేట్ వద్ద అనుమానాస్పద కంటైనర్ లారీని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అధికారులు ఆపేందుకు యత్నించగా లారీ వేగంగా అక్కడి నుంచి దూసుకెళ్లింది. ఎట్టకేలకు పోలీసులు గంజాయి లారీని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్,  కోడూరు వీఆర్వో అప్పలరాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *