వాస్తవాలా లేక ప్రచారాలా?

వీ డ్రీమ్స్ అనకాపల్లి

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెల్ ఫోన్ లలో వాట్సాప్ పేస్ బుక్ ల ద్వారా ప్రచారం అవుతున్నటువంటి వదంతులు వాస్తవాల లేక ఫేక్ ప్రచారాల అనే అయోమయ పరిస్థితి ఎదురవుతున్నది
అవి వాస్తవాలు కాకపోయినా అవాస్తవాలు అయినా ముందుగా ప్రజల్లోకి విపరీతంగా వెళ్లి ప్రజలను అయోమయ పరిస్థితికి గురిచేస్తున్నాయి

రాజకీయ నేతల విమర్శలను కూడా పూర్తిగా కాకుండా అసంపూర్ణ వీడియోలను పెడుతూ వివాదాలను రేకెత్తిస్తున్నారు వీటివలన అనవసర వివాదాలు సృష్టించబడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది

ప్రస్తుతం అనకాపల్లిలో విపరీతంగా ప్రజల్లో ప్రచారం అవుతున్న విషయం కూడా ఇటువంటిదేనా లేక వాస్తవమా అనే విషయాలు స్పష్టంగా కావాల్సిన అవసరం ఉంది
అనకాపల్లి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు ఒకరు నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా బ్యాంకుల్లో తాకట్టులు పెట్టి కోట్లాది రూపాయలను బ్యాంకుల నుండి రుణంగా తీసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది

ఈ విషయంలో పోలీస్ అధికారులు ఒక స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఇది వాస్తవమా లేక ఫేక్ ప్రచారమా ?

సామాన్యుడు తన ఇంటి అవసరము లేదా శుభకార్యం లేదా వ్యవసాయ అవసరం కోసం తన సొంత బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక పదివేలు రుణముగా తెచ్చుకోవాలంటే అనేక నిబంధనలు బంగారాన్ని పరిశీలించడం వంటి చర్యలు ఉంటాయి అటువంటిది కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చే విషయంలో అంతా సునాయాసంగా బ్యాంకులో రుణాలు ఇవ్వడం జరుగుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది

ఒకవేళ ఇది వాస్తవమే అయినట్లయితే అది కేవలం ఒకరితో అయ్యే పని కాదు ఈ కుంభకోణంలో చాలా చేతులు ఉండే అవకాశం కూడా ఉంది వాటన్నిటి విషయాలు బయటికి రావలసిన అవసరమన్నది

ఇది వాస్తవంగా జరిగిందా లేక రాజకీయ ఆరోపణలు కుట్రలో భాగంగా ఇటువంటి ఆరోపణలు జరుగుతున్నాయా అనే విషయం మీద స్పష్టత అవసరం

పోలీస్ శాఖ ఈ విషయం మీద దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది లేకుంటే ఇటువంటి ప్రచారాలలో ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *