కుంచంగి వీఆర్వో రమేష్ కు సోకాజ్ నోటీస్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికారులకు అందుబాటులో ఉండకపోవడం, సచివాలయంలో ప్రజాసమస్యలు పేరుకుపోవడం వంటి కారణంగా కుంచంగి వీఆర్వో బత్తుల రమేష్ కి సోకాజు నోటీసు జారీచేసారు. గత కొద్ది నెలలుగా రెవిన్యూ అధికారులకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే అనేక ప్రజా సమస్యలు దరఖాస్తులు పెండింగ్లో ఉంచడంపై తాసిల్దారు ఆనంద్ మండిపడ్డారు. కనీసం మొబైల్ ఫోన్ కూడా స్పందించడం లేదని సోకాజి నోటీసులో పేర్కొన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపణలు ఉండటం కూడా ఒక కారణమని ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన విజ్ఞప్తులు కూడా పేరుకు పోయాయని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ సోకాజ్ నోటీసు పై ఒక్క రోజులో సమాధానం తెలపాలని పేర్కొన్నారు. అయితే రమేష్ ఈ సోకాజి నోటీసు పై ఎటువంటి సమాధానం అధికారులకు ఇవ్వలేనట్లు తెలిసింది. దీంతో రమేష్ ను జిల్లా కలెక్టర్ వారికి సరెండర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *