మెజార్టీ స్తానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది.
లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధుల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ మిగిలిన 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎనిమిది మంది అభ్యర్ధుల ఎంపికపై అధిష్టానానికి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది.