ఎన్నికల ప్రచార సభలో సుజల స్రవంతి జాప్యం పై విమర్శలు సంధిస్తున్న కొణతాల రామకృష్ణ
బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను చేపట్టలేక చతికిల పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయని పథకంలో నిర్వాసితులైన రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోదావరి జలాల సంగతి దేవుడు ఎరుగు రెండేళ్ల కిందట సేకరించిన మా భూములకు పరిహారం చెల్లించకపోగా సేకరించిన భూమి పక్కనగల తమ ఇతర భూములను కూడా 22a నిషేధిత జాబితాలో చేర్చి ఇక్కట్లకు గురి చేస్తున్నారని వీరు ఆందోళన చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో సుజల స్రవంతి పథకం కోసం 1200 ఎకరాలను సేకరించి అదే నిర్వాసితుల ఇతర భూమిని కూడా సేకరించిన భూమితో పాటు నిషేధిత జాబితాలో చేర్చారు. ఇలా 22ఏలో చేర్చిన భూమి మొత్తం విస్తీర్ణం సుమారుగా రెండు వేల ఎకరాలకు పైగానే ఉంది. గత రెండేళ్లుగా ఈ భూముల క్రయవిక్రయాలు నిషేధించడం వలన పేద రైతులకు శాపంగా మారింది. ఈ సమస్యను మంత్రి అమర్నాథ్ దృష్టికి ఏడాది కిందట రైతులు తీసుకొని వెళ్లారు.. అయితే ఆయనలో ఎలాంటి స్పందన లేదని వెంకుపాలెం, పాపయ్య పాలెం, పిఎస్ పాలెం, తుమ్మపాల, కొండుపాలెం రైతులు విమర్శిస్తున్నారు
ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు తమకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ప్రాజెక్టు నిర్మాణం సంగతి కొస్తే ఇదొక పెద్ద ప్రహసనంగా తయారయింది. వైసిపి ఈ ప్రాజెక్టు నిమిత్తం 650 కోట్ల బడ్జెట్ను కేటాయించి 18 కోట్ల 50 లక్షల రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. ఇందులో భూసేకరణ నోటిఫికేషన్ కోసం అధిక భాగం ఖర్చు అయ్యింది. పూర్తి పేజీ ప్రకటనల లో 80 శాతం సాక్షి దినపత్రికకు విడుదల చేసి వైసిపి తన సంక్షేమం చూసుకుందని బయ్యవరం, ఉగ్గిన పాలెం రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరిన నిధులు విడుదల చేయలేదు.
భూ అధి గ్రహణ నోటీసుల కాల పరిమితి వచ్చే జూన్ నెల నాటికి ముగియనుంది అనకాపల్లి జిల్లాలో కేవలం రెండు గ్రామాలలో అడ్డూరు, కొండపాలెం మాత్రమే భూ సేకరణ సర్వే పూర్తి చేసి పరిహారం చెల్లించేందుకు పనులు పూర్తి చేశారు.
అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం మేడపైన ఓ చిన్న కొట్టు గదిలో సుజల స్రవంతి కార్యాలయం కనిపిస్తుంది ఒకరిద్దరి సిబ్బందితో నిర్వహణ ఖర్చులు కూడా లేని స్థితిలో కార్యాలయం కొట్టుమిట్టాడుతోంది. అరువు కంప్యూటర్లు ఒకటి రెండు ఉన్నాయి. 7200 కోట్ల అంచనా తో రూపొందించిన ఈ పథకం నిర్మాణ వ్యాయం 17వేల కోట్లకు పెరిగింది. మరోపక్క పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కానందున గోదావరి జలాల తరలింపు ఎండమావిగా మిగిలింది.
ఉత్తరాంధ్ర ఎన్నికల ముందు గొంతు చించుకొని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి తన హాయంలో చేసిన నిర్వాకం అనకాపల్లి బరిలో నించున్న కూటమి అభ్యర్థులు తమ ప్రచారాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు
సర్వే సిబ్బందిని నియమించనే లేదు
భూ సేకరణ నిమిత్తం సర్వేయర్లు డ్రాఫ్ట్స్ మెన్ లను
నియమించకుండా నే పని
కానించేసారు.సచివాలయం సర్వేయర్ల సాయం తో భూ సేకరణ జరిపారు.ఇది సరైన పద్ధతి లో జరగలేదని, అలైన్మెంట్ సమస్యలు ఎదురవుతాయని,రైతుల భూమి వృధాగా పోవచ్చని
ఇంజినీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పథకం పట్ల వైసీపీ ప్రభుత్వ
నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనం
అని రైతులు విమర్శిస్తున్నారు