వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి విశాఖ జిల్లాల్లో ఆధార్ కార్డుల స్కామ్ మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో ఒకసారి బయల్పడిన స్కాంపై తగిన చర్యలు లేకపోవడంతో అనకాపల్లి జిల్లాలో కూడా ఈ స్కాం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోన్ది. ఈ కుంభకోణం వలన లక్షలాది రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నది. ఈ కుంభకోణంలో బ్రోకర్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఒక బ్రోకర్ సుమారు కోటి రూపాయలతో
పెద్ద భవంతిని నిర్మించాడని తెలియ వచ్చింది.
స్కాం జరిగే తీరు:
వృద్ధాప్య పెన్షన్లు అర్హత పొందెందుకు వయోపరిమితిని ప్రభుత్వం 65 నుంచి 60 సంవత్సరాలకు (2019) తగ్గించింది.60 సంవత్సరాల కన్నా తక్కువ అంటే 55,56 సంవత్సరాల వయసున్న పేదలను బ్రోకర్లు గుర్తించి వారికి వృద్ధాప్య పెన్షన్ లో మంజూరు చేయిస్తామని చెప్తారు. వారి ఆధార్ కార్డులు సేకరించి ఆ కార్డులలో పుట్టిన తేదీని మార్చివేయించి వారికి 60 సంవత్సరాల వయసు పై పడినట్టుగా ఆధార్ రి కార్డును తయారు చేయిస్తారు ఇందుకు ఫేక్ జనన ధ్రువపత్రాలను ఆధార్ సెంటర్లలో సమర్పిస్తారు. ఆధార్ కార్డులలో పుట్టిన తేదీ మార్పులను నమోదు చేసే నిర్వాహకులకు కొంత సొమ్ము చెల్లించి పని పూర్తి చేస్తారు. మార్పు చేసిన ఆధార్ కార్డులను చూపి వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తు చేయిస్తారు. ఇలాంటి తతంగాన్ని అనుసరించి గతం లో చేయూత పథకంలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కీము అక్రమాలకు పాల్పడ్డారని తెలియవచ్చింది
ఇలాంటి మోసాలు ఏమైనా ఒకటి రెండు బయటపడితే ఆధార్ కేంద్రాల నిర్వాహకులను వారి బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు. మినహా ప్రభుత్వాన్ని మోసగించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
లాభం కన్నా నష్టమే ఎక్కువ :
పుట్టిన తేదీ మార్పు ద్వారా వయస్సు అధికంగా చూపించి పథకాల ప్రయోజనాన్ని పొందే వారికి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎలా అంటే జీవిత బీమా, ఆరోగ్య భీమా తదితర పలు బీమా పథకాలు కింద నమోదైన పేదల. వాస్తవ పుట్టిన తేదీకి మార్పు చేసిన పుట్టిన తేదీకి తేడా ఉండటంవల్ల బీమా తదితర పథకాలు నిలిచిపోతాయి. దీనివలన నష్టం లక్షల్లో ఉంటుంది. కనుక ఇలాంటి అక్రమాలకు పాల్పడం మంచిది కాదని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డులో ఒకసారి వయస్సు మార్పు చేసిన తర్వాత మరోసారి మార్పు చేసుకునే అవకాశం ఉండదు. కనుక అక్రమ నమోదులకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డుల అక్రమాలకు పాల్పడిన వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది కార్డులను బ్లాక్ చేశారని తెలియ వచ్చింది. అయితే అక్రమాలను ప్రోత్సహిస్తూ డబ్బు సంపాదిస్తున్న బ్రోకర్లు మాత్రం సులభంగా తప్పించుకుంటున్నారు.
వాలంటీర్ల తో విచారణ!!!
ఆధార్ లో అక్రమ మార్పుల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారి విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఓల్టేజ్ పెన్షనర్స్ వివరాలను ఆరా తీయాల్సిందిగా వాలంటీర్స్ ను ఆదేశించింది.ఆ తర్వాత ఏం జరిగిందో సంబధిత అధి కారులు కూడా చెప్ప లేక పోతున్నారు. అధికార పార్టీ స్థానిక నాయకుల జోక్యంతో
అంతా గుప్ చప్ అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి.