వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి బైపాస్ రోడ్డు బిజెపి పార్లమెంట్ కార్యాలయంలో సీఎం రమేష్ గారి సోదరుడు సీఎం రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా మళ్ళసురేంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అలాగే సీఎం రాజేష్ కేంద్రంలో కీలక పదవిలో ఉండడం ఖాయమని అన్నారు. అనకాపల్లి అభివృద్ధికి కృషి చేసి అనకాపల్లి ప్రజల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించాలని కోరారు. అనకాపల్లి పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలని, అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం రమేష్ గెలుపులో మేమందరమే కీలకంగా పని చేస్తామని ఈ సందర్భంగా సురేంద్ర తెలిపారు. సీఎం రాజేష్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఎం రిత్విక్, 82 వ డివిజన్ ఇంచార్జ్ పోలవరపు త్రినాథ్, జిల్లా టిఎన్టియుసి ఉపాధ్యక్షులు పిట్ల రాజు, ఎల్లపు శ్రీనివాసరావు, దాడి బుజ్జి, అనకాపల్లి నియోజకవర్గం టిఎన్టియుసి అధ్యక్షులు ఆకుల నానాజీ, అనకాపల్లి పార్లమెంట్ గవర కార్యదర్శి దొడ్డి రాము, మద్ది దొర, కర్రీ మహాలక్ష్మి నాయుడు, జొన్నాడ సురేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాను చంద్ర, తదితరులు పాల్గొన్నారు.