వీ డ్రీమ్స్ అనకాపల్లి
నేడు అనకాపల్లి జార్జ్ క్లబ్ ఆవరణలో ఉచిత హోమియో మరియు డెంటల్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నమని నిర్వాహకులు
ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ విల్లూరి జోగినాడు, డాక్టర్ కృష్ణమూర్తి, డెంటల్ వైద్యులు డాక్టర్ సంజన లు ఉచిత వైద్యాన్ని అందిస్తారని
నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా అవసరం మేరకు ఉచితంగా మందులు ఇవ్వబడతాయని ఆయన తెలిపారు కావున ప్రతి ఒక్కరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.