వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లిలో స్థానిక జీవీఎంసీ 81వ వార్డు పాత మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన పతివాడ భాస్కరరావు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు 50 మంది అనుచరులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత మద్యం , డ్రగ్స్ , గంజాయి వంటి వ్యసనాలకు బానిసలు అయ్యారని ఇటువంటి పరిపాలనను చూస్తున్న యువత ప్రజలు మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేని మంచి ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వాలను యువత కోరుకుంటున్నారని అందువలన రోజురోజుకీ జనసేన కి ఆదరణ పెరుగుతుందని అందువల్లనే యువత అంతా వేరే పార్టీల నుంచి జనసేనకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 81 వ వార్డు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.