రీ సర్వే పనుల్లో తప్పులు జరగ కూడదు : డివిజినల్ ఇన్స్పెక్టర్ ఆప్ సర్వే వెంకన్న

 

వీ డ్రీమ్స్, అనకాపల్లి

ప్రతి ఒక్కరు రీ సర్వే లో తమ భూముల వివరాలు నమోదు చేసుకోవాలని డివిజినల్ ఇన్స్పెక్టర్ ఆప్ సర్వే వెంకన్న తెలిపారు. మంగళవారం ఆయన అనకాపల్లి మండలం కొండుపాలెం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో 12 రెవెన్యూ గ్రామాలను పైలట్ గ్రామాలు ఎంపిక చేసి రీ సర్వే పనులు చేపట్టామని అన్నారు.. అత్యదిక విస్తీర్ణం తో కూడిన సర్వే నెంబర్లు కశింకోట మండలం తీడ రెవెన్యూ గ్రామంలో ఉన్నాయని ఈ గ్రామంలో రీ సర్వే జరుగుతుందని ఇప్పటికే రైతులకు నోటీసులు ఇవ్వడం జరుగితుందని అన్నారు. అలాగే అచ్యుతాపురం మండలంలో అతి తక్కువ విస్తీర్ణం కలిగి గ్రామం లో కూడ రీ సర్వే పనులు చురుకుగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రైతులకు నోటీసులు ఇవ్వడం తో పాటు సర్వే కూడా నిర్వహిస్తున్నామని అన్నారు ‌ఈ రీ సర్వే లో ఏరియా యారాట్ అంటే భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉండి సర్వే సెటిల్మెంట్ లో తక్కువ విస్తరణ నమోదు అయి ఉ‌న్న రైతులకు రీ సర్వే లో భూమి విస్తీర్ణం మొత్తాన్ని నమోదు చెయ్యడం జరుగుతోందని అన్నారు. అలాగే వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టి ఉంటే ఆ ఇంటి విస్తీర్ణాన్ని తగ్గించి మిగిలిన విస్తీర్ణానికి వ్యవసాయ భూమిగా ఎల్పిఎం ఇవ్వడం జరుగుతుందని వెంకన్న తెలిపారు. అంతే కాకుండా గ్రామాల్లో ఉన్న లే అవుట్ లను కూడా రీ సర్వే లో నమోదు చెయ్యడం జరుగుతుందని అన్నారు. అయితే ఈ లే అవుట్ లు ల్యాండ్ కన్వర్షన్ చెయ్యకపోతే నాలా చెల్లింపు కు నోటీసులు ఇవ్వడం జరుతుందని ఈ లే అవుట్ లలో ప్రభుత్వ భూములు ఉండి ఉంటే వాటి వివరాలను అధికారులకు తెలియజెయ్యడం అవుతుందని అన్నారు. ఈ రీ సర్వే లో ఎటువంటి లోపాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఒక్కొక్క సారి వెబ్ ల్యాండ్ లో నోషనల్ నెంబరు తో వివరాలు ఉండి అదే భూమి జ్రయ విక్రయాలు జరిగి ఉంటే కొనుగోలు చేసిన వ్యక్తులు రీ సర్వే లో తమ భూ వివరాలు నమోదు చేసుకోవాలని లేకుంటే నోషనల్ నెంబరు తో ఉండే వ్యక్తుల పేర భూమి నమోదు అయ్యే అవకాశం ఉందని దీని వలన కొనుగోలు చేసిన వ్యక్తులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరు రీ సర్వేలో తమ భూమి రికార్డులను చూపించి నోటీసులు అందుకోవాలని ఆయన సూచించారు.

రీ సర్వే పనులను పరిశీలించిన డివిజినల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకన్న, ఈ సర్వే కార్యక్రమంలో విఆర్ఒ లు సూర్యనారాయణ, సురేష్, విలేజ్ సర్వేయర్ లు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొండుపాలెం గ్రామంలో రైతులకు నోటీసులు అందజేస్తున్న మాజీ సర్పంచ్ శెట్టి పైడి నాయుడు, సర్వేయర్ రామలక్ష్మి, విఆర్ఒ సూర్యనారాయణ తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *