కలెక్టరేట్, అనకాపల్లి (వీ డ్రీమ్స్)
కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి సూచించిన ప్రకారం పారదర్శక మరియు నిస్పక్క్షపాత ఎన్నికల నిర్వహణ దిశగా కార్యకలాపాలు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ చర్యలు చేపట్టాలన్నారు.
అంతకుముందు ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను, నిర్వహిస్తున్న విధులను రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు ఎస్.పి లను అడిగి తెలుసుకుని తగు సూచనలిచ్చారు. జిల్లా లో ఇంతవరకు ఫార్మ్ డిస్పోసల్ , ఎంసిఎంసి రిపోర్ట్స్ , ఎంసిసి వయోలేషన్, గ్రీవెన్స్ కమిటీ, సిజర్ మేనేజ్మెంట్, పోలింగ్ పర్సనల్ రాండమైజేషన్ తదితర కార్యక్రమాల వివరాలను, తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు వివరించారు. జిల్లాలో చెక్ పోస్ట్ నిర్వహణ, తీసుకుంటున్న చర్యలు గూర్చి, ఎన్నికల దృష్ట్యా చేపడుతున్న పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్.పి. విజయబాస్కర్, డి.ఆర్.ఓ. బి.దయానిధి, ఎస్.డి.సి. సుబ్బలక్ష్మి, డి.ఎస్.ఓ. కెవిఎల్ఎన్ మూర్తి, డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ హేమంత్, సిపివో జి.రామారావు, మత్సశాఖ ఎడి ప్రసాదు, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, కమాండ్ కంట్రోల్ రూమ్ లో వివిధ విభాగాల నోడల్ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.