వీ డ్రీమ్స్ విశాఖపట్నం
ఆంద్రప్రదేశ్ లో పరిశ్రమలు స్థాపనకు రాష్ట్ర ఐటి & విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని ఆంద్రప్రదేశ్ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర అన్నారు. పరిశ్రమలు స్థాపన కోసం దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని మొదటిసారిగా విశాఖ కి వచ్చిన సందర్బంగా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసి ఉందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడ వైసిపి ప్రభుత్వానికి భయపడి ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావడం హర్షనీయమని అన్నారు.