వీ డ్రీమ్స్ అనకాపల్లి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు సందర్భంగా రింగ్ రోడ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ వర్ధిల్లాలి నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేశారని, కేక ను ఒకరికొకరు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు చీరల పంపిణీ నాగ జగదీష్ ఆర్థిక సహాయంతో 150 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ లోకేష్ ఉన్నత విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి కావడంతో స్వల్ప కాలంలోనే ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారని, నిరుద్యోగంతో బాధపడుతున్న యువతి యువకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మెగా డీఎస్సీ 16,437 పోస్టులు, గ్రూప్ వన్ పోస్టులు 866 భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని, టి సి ఎస్ విశాఖపట్నంలో వారు క్యాంపస్ ఏర్పాటు చేసి 10,000 వేల మందికి ఉద్యోగాలు అవకాశం ఉందని, అలాగే విశ్వవిద్యాలయంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 3300 పోస్టులు భర్తీకి రూట్ మ్యాప్ నిర్ణయించారని, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ నిప్పన్ ఉక్కు ఫ్యాక్టరీ రాబోతుందని సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా మరో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు చేపడతారని, బల్క్ డ్రగ్ హబ్ నక్కపల్లి లో ఏర్పాటు చేస్తున్నారని, ఏ విద్యార్థి నిరుద్యోగ ఉండరాదు లక్ష్యంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలు, సామాజిక అవసరాలు కనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్నారని, ఉపాధి కల్పన లక్ష్యంగా డిజిటలైజేషన్ కు పెద్దపీట నారా లోకేష్ వేసారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ బోడి వెంకటరావు విల్లూరి రమణబాబు బుద్ధ కాశి మొల్లి రమణ పూడి త్రినాథ్ కాండ్రేగుల ముకుందా పెట్ల సత్యనారాయణ బుద్ధ విశ్వనాథ్ కర్రీ మల్లేశ్వరరావు కైచర్ల చిన్న తదితరులు పాల్గొన్నారు.
