వీ డ్రీమ్స్ అనకాపల్లి
గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ ఈ సి ఎస్ ) లిమిటెడ్ కశింకోట పర్సన్ ఇంచార్జ్ గా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ ఈ సి ఎస్ ), కాసింకోటకు అధికారిక పర్సన్-ఇన్-చార్జ్‌గా నియమిస్తూ వ్యవసాయం & సహకార శాఖ ప్రభుత్వ ఉత్తర్వులు జారిచేసిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అడిట్ అధికారి ఎం.శ్యామల, అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్.ఈ.సి.ఎస్) ప్రాజెక్ట్ ఇంజనీర్ జె. ప్రసాద రావు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
