జిల్లా కలెక్టర్, జెసి లు క్షమాపణ చెప్పాలి : జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం

వీ డ్రీమ్స్ విజయనగరం

విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జెసి సేధు మాధవన్ లు సర్వే ఉద్యోగులపై కక్ష కట్టి హీనంగా చూస్తున్నారని విజయనగరం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చౌదరి వెంకటరావు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీ సర్వే ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నారని1956 రీ సర్వే రికార్డులను పరిశీలించి ఎటువంటి సమస్యలు రాకుండా సర్వే ఉద్యోగులు ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. పగలు రాత్రి అని చూడకుండా విలేజ్ సర్వేయర్ మొదలుకొని అసిస్టెంట్ డైరెక్టర్ వరకు అన్ని లెవిల్ లో రాత్రి, పగలు కష్ట పడుతుంటే వీరు మమ్మల్ని హీనంగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కష్టపడి పని చేస్తుంటే రికార్డులను పాడు చేస్తున్నారని సర్వేయర్ లపై తప్పు గా మాట్లాడుతున్నారని అన్నారు. దీనివల్ల సర్వే ఉద్యోగుల మనో భావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ప్రతి సమీక్షా సమావేశం లోను సర్వే డిపార్ట్మెంట్ ఫైల్యూర్ అంటూ దూషించాడం భాదాకరమని అన్నారు.జిల్లా కలెక్టర్, జెసిల తీరుపై రెండు రోజులు నుండి పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. సర్వేయర్ లు నిరసనలో ఉంటే భూమి కి సంబంధించి ఏ పని అయిన జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. రీ సర్వే గాని,పిజిఆర్ఎస్ గాని విలేజ్ సర్వేయర్ అప్లోడ్ చెయ్యాలని మోడరన్ టెక్నాలజీతో సర్వేయర్ లు పని చేస్తున్నారని అన్నారు. షేప్ ఫైల్ కి ప్రభుత్వం 21 రోజులు గడువు ఇస్తే ఆ పనిని రెండు రోజుల్లో పూర్తి చెయ్యాలని సర్వే ఉద్యోగుల పై ఒత్తిడి తేవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం లో జరిగిన తప్పిదాలు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీ సర్వే ని నిదానంగా ఎటువంటి పొరపాటులు లేకుండా జరగాలని అవసరం అయితే మరికొంత సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారని ఈ సందర్భంగా తెలియజేసారు. గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రైతుకు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంటే ఒక్కటి రెండు రోజుల్లో షేప్ ఫైల్ ని పూర్తి చెయ్యాలని మాపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని వారు ఆరోపించారు. ఇలా అయితే గత ప్రభుత్వం జరిపిన తప్పులే పునరావృతం అవుతాయని దీనివల్ల రైతులు చాలా నష్టపోతారని అన్నారు. జిల్లా కలెక్టర్, జెసి ల తీరు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వ పెద్దలకు తెలియాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసామని అన్నారు.21 రోజుల్లో చెయ్యవలసిన పనిని రెండు రోజుల్లో పూర్తి చెయ్యాలని మాపై కలెక్టర్, జెసిలు ఒత్తిడి తీసుకు వస్తున్నారని అన్నారు. పిజిఆర్ఎస్ కు 70 రోజులు సమయం ఉన్నప్పటికీ రాత్రికి రాత్రి క్లోజ్ చెయ్యాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కలెక్టర్, హెసి తీరును ప్రజలే గమనించాలని అన్నారు. ఈ ఫైల్యూర్ ని చూపించి ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావడానికి చూస్తున్నట్లు ఒక్కోసారి అనిపిస్తుంది అని అన్నారు. రీ సర్వే లో వచ్చిన ప్రతి దరఖాస్తు దరఖాస్తు దారునికి న్యాయం జరిగేలా సర్వేయర్ లు పనిచేస్తున్నారని అన్నారు.రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం సంఘీబావం తెలిపిందని బుధవారం రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు వస్తున్నారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన సర్వేయర్ లు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సర్వేయర్ ల సంఘం ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు వెంకటరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *