వీ డ్రీమ్స్ అనకాపల్లి
గణిత శాస్త్రవేత్త దివంగత శ్రీనివాస రామానుజన్ అయ్యంగర్ జయంతి వేడులకను స్థానిక డిఎవి పబ్లిక్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు మహదేవ్ శాస్త్రి అన్నారు.1887 లో మద్రాసలో జన్మించిన శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ భారత దేశంలో గణితంలో దిట్ట అని అన్నారు. శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ బిన్నాలు లాంటి గణిత విభాగంలో విశేషమైన కృషి చేసారని అన్నారు. విద్యార్థులకు గణితం పై అవగాహన జరిపి నిజ జీవితంలో అన్వయించుకని విద్యార్థులు గణితంలో ముందంజలో నిలవాలని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు