అనకాపల్లి వీ డ్రీమ్స్
అనకాపల్లి మండలంలో కె.ఎన్.ఆర్ పేటలో శనివారం ఉదయం జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ , మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. తెలుగు దేశం పార్టీ నాయకులు మాధం శెట్టి నీలబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో కె.ఎన్.ఆర్ పేట సంబంధించిన కార్యకర్తలు , ప్రజలు ప్రాంత సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు రాజశేఖర్ రెడ్డి లాగ మంచి పరిపాలన అందిస్తాడు అనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని తల్లిని చెల్లిని అందరినీ వాడుకొని పదవుల్లోకి వచ్చిన తర్వాత సొంత బాబాయిని చంపించి తల్లిని చెల్లిని కూడా బయటికి నెట్టేసిన దుర్మార్గపు రాజకీయాలు చేశాడని అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ,గంజాయి, ఇసుక, మైనింగ్ భూకబ్జాలు మీద ఉన్నటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టి ఉండుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదని బటన్ నొక్కుతున్నాను అక్క చెల్లెలు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాను అని చెబుతూ అదే అక్క చెల్లెమ్మ దగ్గర పన్నుల రూపంలో రూపాయి తీసుకొని పావలా తిరిగి ఇస్తున్నాడు అన్న సంగతి గ్రహించాలని అన్నారు. ఇదంతా చూస్తుంటే పూర్వకాలం “ముడ్డి గిల్లి జోల పాడిన” సామెత గుర్తొస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ విధంగా ఉందని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకటించే సమయం ఆసన్నమైందని కనుక తెలుగుదేశం చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ బిజెపి నరేంద్ర మోడీ ముగ్గురు త్రిమూర్తుల్లా కలవడం మన అదృష్టం అని ఈ కలయిక వల్ల కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ఇక ఏ శక్తులు త్రిమూర్తులు దగ్గర పని చేయవని కనుక మీరందరూ ఈ నెల రోజులు పాటు కష్టపడి ఉమ్మడి లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు జనసేన గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి ఓటు బిజెపి కమలం గుర్తుపై వేసే విధంగా ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను మనకు జరిగిన అన్యాయాల గురించి వివరిస్తూ ప్రభావతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీరు అడిగిన మీ ప్రాంత సమస్యలపై మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ప్రాంత నాయకులతో చర్చించి మీ సమస్యలన్నీ నూటికి నూరు శాతం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ , చూచుకోండ రమణ , జాజిమొగ్గల అప్పలరాజు , యర్రా వెంకట సత్యనారాయణ , జనసేన పార్టీ నాయకులు సిరిసిపల్లి ప్రసాద్ , చేబోలు దుర్గాప్రసాద్ , యీతా గోపీ , కార్యకర్తలు , ప్రజలు పెద్ద ఎత్తును పాల్గొన్నారు.