వీ డ్రీమ్స్ పరవాడ
పరవాడ మండలం తాడి గ్రామంలో ఫార్మా వ్యర్థాలను గ్రామాన్ని ఆనుకొని శివాలయం దగ్గర కొండ ప్రాంతంలో ఫార్మా వ్యర్ధాలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఫార్మా వ్యర్ధాలను మండించడం వలన తీవ్రమైన కాలుష్యం వెదజల పడుతుందని దీనికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వ్యర్ధాలు మండిస్తున్న ప్రాంతాన్ని సిఐటియు గని శెట్టి సత్యనారాయణ, డివైఎఫ్ఐ నాయకులు గల్లా భార్గవ్ పరిశీలించారు. అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ రాంకీ యాజమాన్యం చెక్పోస్టులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల వ్యర్ధాలు ఆరుబయట గ్రామాలను ఆనుకొని వేసి మండిస్తున్నారని దీనివల్ల తీవ్ర కాలుష్యం వేద జలబడుతుందని దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవిన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు
