వీ డ్రీమ్స్ అనకాపల్లి
భూముల్ని కాజేయ డం లో పేరుపడ్డ అధికార పార్టీ నాయకుడొకరు, వై సీ పీ హయాంలో మంత్రులభూ అక్రమాలకు సాయపడికోట్లు వెనకేసుకు న్న ఓరెవెన్యూ ఉన్నతాధికారి అనకాపల్లి జిల్లా కోడూరు భూ కుంభకోణం ను అంతా తామే ఆయినడిపించార నీ మీడియా కోడై కూస్తోంది. ఈ తాజా భూ కుంభకోణం పై ఆంధ్ర జ్యోతి ప్రజాశక్తి ప్రచురించిన కథనాలు జిల్లా లో కూటమి . వైసీపీ నాయకుల రాజకీయ వ్యాపారం ను బట్ట బయలు చేశాయి. ఈ తతంగం జిల్లా మినీ మహానాడు లో ప్రకంపనలు సృష్టించింది. స్వలాభం కోసం పార్టీ పరువు ను బజారు కీడ్చిన నాయకుడి పై కార్యకర్తలు అభిమానులు రుసరుస లాడారు.మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు కోడూరు కుంభ కోణం నిగ్గు తేల్చి పార్టీ పరువు కాపాడాలని కోరారు. దాడి వీర భద్ర రావు ‘వైసీ పీ రెవెన్యూ అధికారులముఠా ‘పై మరోసారి ధ్వజ మెత్తారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశంకి చెందిన ఒక ముఖ్య నాయకుడు ప్రభుత్వ భూమిని రైతుల ఆక్రమణ భూమిగా సృష్టించి సుమారు 6.38 కోట్ల రూపాయలు దోచేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గతంలో కోడూరు గ్రామంలో పరిశ్రమలు నిమిత్తం సుమారు రెండు వందల పైచిలుకు ఎకరాల అసైన్డ్,ఆక్రమణ భూములను సేకరించిన విషయం తెలిసిందే. అప్పుడే సర్వే నెంబరు 20 తెరమీదకి వచ్చింది. ఈ భూమిలో సుమారుగా 20 మంది రైతులు సాగులో ఉన్నామని ఈ భూమిని కూడ పరిశ్రమలకు తీసుకోవాలని కొందరు తహసీల్దారు కి అర్జీ పెట్టారు. అయితే ఆనెంబరు . (కోడూరు సర్వే నెంబరు 20 )ప్రభుత్వ భూమిగా గతంలో ఇక్కడ పని చేసిన ఒక తహసీల్దారు ప్నిర్దారించారు. 2009 లో ఒక దిన పత్రిక లో వచ్చిన వార్తా కథనం పై అప్పటి తహసీల్దారు విచారణ చేపట్టారు. కోడూరు, గోపాలపురం గ్రామాలకు చెందిన రైతులు సర్వే నెంబరు 20లో కోడూరు, గోపాలపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించారు.
అయితే కొప్పాక గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్మ రైతులకు కొంత డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్న విషయం విచారణలో తేలింది దీంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసు కొన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ భూమి రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంది. సుబ్బారెడ్డి నుండి రెవెన్యూ అధికారులు సర్వే నెంబరు 20 లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడం తో మరలా ఈ రైతుల కన్ను భూమిపై పడింది అప్పడే కోడూరు లో పరిశ్రమలు నిమిత్తం ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టింది. దీంతో ఈ రైతులు మరో మారు ఈ భూమిపై కి వచ్చేందుకు ప్రయత్నం చేసారు కాని అప్పుడే తహసీల్దారు రిక నెం.2015/ఎ/తేదీ29/2/2016 న ద్వారా అందులో ఎవరూ సాగులో లేరని రైతులకు ఎండార్స్మెంట్ లేఖలను అందజేసారు. సర్వే నెంబరు 20 ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు నిర్దారణ చేసి కోడూరు గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు ఆనాటి నుండి నేటి వరకు ఈ భూమి రెవెన్యూ అధికారుల ఆధీనంలోనే ఉంది. దీనికి ముందు కొద్ది నెలలు ఇక్కడ ఇన్ చార్జ్ తహసీల్దారు గా పని చేసిన ఎం మనోరంజని కూడా అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అనకాపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించారు. ఈ నేపథ్యం లోనే తహసీల్దారు మనో రంజని అనకాపల్లి మండలం లోని కోడూరు సర్వే నెంబరు 20 తో పాటు మండలం లోని ప్రభుత్వ భూముల వివరాలను Rc.no.121/2016/A DT.05.05.2016 లేఖ ద్వారా అందజేసారు. అయితే గత ఏడాది పిబ్రవరి లో అనకాపల్లి తహసీల్దారు కె. విజయ్ కుమార్ మరొ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు రిక.నెం509/2023 ఎస్ఎ తేది 17/10/2024 న మరొక సారి భూమి పై విచారణకు రెవెన్యూ, హార్టికల్చర్, ఫారెస్ట్ శాఖల నుండి నాలుగు టీం లను ఏర్పాటు చేసారు. ఈ టీం లో పాల్గొన్న ఉద్యోగులు సమగ్రంగా విచారణ నిర్వహించి ఒక నివేకను తహసీల్దారు కి అంద చేసారు. అయితే ఈ నివేదికను గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఎవరికి తెలియవు. దీనికి ముందు అంటే 29-2-2016 న అప్పటి తహసీల్దారు తయారు చేసిన నివేదిక బుట్ట దాఖలు అయినట్లేనా అని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయని తెలుసుకున్న ఈ రైతులు హై కోర్టు లో పిటిషన్ వేసారు. హై కోర్టు లో పిటిషన్ వెయ్యడానికి తెర వెనుక ఒక రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ అధికారే సర్వే నెంబరు 20 లో ఉన్న భూమిని కోర్టు ని ఆశ్రయించిన రైతులతో కేసును ఉపసంహరించేలా చేసి సాగులో ఉన్నట్లు గా చూపించి ప్రభుత్వం నుండి సుమారు 6.30 కోట్ల రూపాయలు చెల్లించడంలో కీలక పాత్ర పోషించా రని గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండ జిల్లా రెవెన్యూ అధికారులు ఇక్కడ ఆర్డీఒ పై ఒత్తిడి తీసుకు వచ్చి ఫైల్ కదిలేలా చేసారనే ఆరోపణలు వినిపిస్తిన్నాయి.ఈ నేపధ్యంలోనే రెండు రోజులు క్రితం రైతులకు డబ్బులు చెల్లించక ముందు చెల్లించిన తరువాత కూడ ఒక దిన పత్రిక కోడూరు వ్యవహారాన్ని బయట పెట్టింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారుల్లో కనీసం చలనం లేకపోవడం విచారకరం.
ఖండించలేదు
పత్రికలు. అధికార పార్టీ నాయకులు పబ్లిక్ గా విమర్శలు గుప్పిస్తున్న జిల్లా రెవిన్యూ అధికారులు తెలుకుట్టిన దొంగల్లా కిక్కురమనడంలేదు. ప్ర తి కూల వార్తల పై ఖండనలు ఇమ్మని కొద్దిరోజులు ముందే శాఖల అధికారులు కు ఆదేశాలు జారీచేశారు. ఇంత జరిగితే ఇప్పుడెవరు స్పందించడం లేదు.
తెలుగుదేశం పార్టీ మినీ మహనాడు సభలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ లు కోడూరు సర్వే నెంబరు 20 తో పాటు గత ప్రభుత్వం లో జరిగిన ల్యాండ్ పూ లింగ్పై సమగ్ర విచారణ జరపాలని తీర్మానించారు. అలాగే ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ ల దృష్టికి తీసుకు వెళ్తానని జగదీష్ సభలో ప్రకటించారు. గతంలో లా కాకుండా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఈ వ్యవహారంలో భాగస్వామ్యం లో ఉన్న ప్రతి అధికారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎమ్మెల్యే మౌనం??
మౌనం !! అర్డాంగీకారం ???
కోడూరు భూ కుంభకోణం పై స్దానిక కూటమి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మౌనంగా ఉండటం పై కూటమి నాయకుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడవలసిన నాయకులు మౌనంగా ఉండటం ఏమిటని ప్రజలు నుండి వస్తున్న ప్రశ్నలు. సామాన్యుడు ఒక సెంటు స్థలాన్ని ఆక్రమించుకుంటే నానా హైరానా చేసే అధికారులు కోడూరు వ్యవహారం పై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి .కూటమి నాయకుల సమక్షంలో కోడూరు వ్యవహారం పై విచారణ జరపాలని అలాగే ఈ వ్యవహరానికి సంబంధించిన మొత్తం రికార్డును స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రి విచారణ జరిపితే ఈ అవినీతి కుంభకోణం బయటపడటం ఖాయమని ప్రజా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి కొణతాల ఈ వ్యవహారం పై చొరవ చూపి విచారణ కోరాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వైసిపి గప్ చుప్ !!
కుంభకోణం పై ధ్వజమెత్తా ల్సిన
వైసిపి మూగ బోయింది మిలాఖతు ఆరోపణలకు ఆస్కారమిస్తోంది.



