( వీ డ్రీమ్స్అనకాపల్లి విలేకరి)
రాష్ట్ర భూ పరిపాలన అధికారి ఆదేశాల మేరకు ఏడుగురు తాసిల్దారులకు పోస్టింగ్ ఇస్తూ గురువారం కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం కల్లా ఈ పోస్టింగుల్లో చేరకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ వచ్చిన ఆదేశాలే అమలు కాకపోవడం పట్ల రెవిన్యూ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. క్యాడర్ ఆధారిత బదిలీలు పై సీసీఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులు అనుసరించి జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులలో తాసిల్దారులు పి సత్యనారాయణ ఏ సంధ్య కే నూకరాజు ఓ చంద్ర రేఖ జి ఆనందరావు వి శ్రీనివాసులకు వరుసగా రాంబిల్లి నక్కపల్లి గొలుగొండ నాతవరం కసింకోట మునగపాకలకు పోస్టింగ్ ఇచ్చారు. షేక్ ముజీబ్ కు అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బదిలీ చేశారు. మీరంతా గురువారం సాయంత్రానికల్లా పోస్టింగ్ లో చేరాలని కలెక్టర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు కానీ సాయంత్రానికల్లా ఈ ఉత్తర్వులు పెండింగ్లో పడిపోయాయి.
రాజకీయ నాయకుల ముఖ్యంగా ఎమ్మెల్యేల ఒత్తిడిల మేరకు వీటిని పెండింగ్లో పెట్టినట్లు తెలియ
వచ్చింది తనకి ఇష్టమైన వారిని తమ నియోజకవర్గాల్లో నియమించుకోవాలన్నా ఎమ్మెల్యేల పట్టుదల కారణంగా కలెక్టర్ వీటిని నిలిపివేసి వారి సిఫార్సుల ఆధారంగా మొత్తం బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలియ వచ్చింది.
నక్కపల్లి మునగపాక వంటి మండలాలకు కలెక్టర్ ఏరి కోరి కొందరిని ఇటీవలనే తాసిల్దారులుగా నియమించారు.
వారికి స్థానభ్రంశం కలిగించడం కలెక్టర్ కూడా ఇష్టం లేకపోవడం వలన ఈ ఉత్తర్వులు నిలిచిపోయాయని మరొక వాదన వినిపిస్తోంది ఏదేమైనా కొత్త మార్పులు చేర్పులతో రెండు మూడు రోజుల్లో కొత్త ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఒకరు చెప్పారు


