వీ డ్రీమ్స్ ఉక్కునగరం
విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురు కార్మికులను ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. తీవ్రమైన ఉష్ణోగ్రత తో మరుగుతున్న ఉక్కు ద్రవం ఒలిగి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఒకప్పుడు భద్రతకు పేరొందన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి నేడు దయనీయంగా మారి భద్రతా లోపాల కారణంగానే
ఈ ప్రమాదం జరిగిందని కార్మిక వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాలు అందాక ప్రమాద కారణాలను చెప్తామని ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని యాజమాన్యం ప్రకటించింది.
ఇదిలా ఉండగా తేమ తో నిండిన ఫెర్రోసిలికాన్ వలనే ఈ ఘోర విపత్తు సంభవించిందని,
ఫెరోసిలికాన్ బరువు పెంచేందుకు తేమను నింపి కాంట్రాక్టర్ సరఫరా చేశాడని ఎక్కువ బరువు పెరగితే ఎక్కువ ఆదాయం వస్తుందన్న దురాశ కారణంగానే ఇలా చేశారని ఇదే ఈ ప్రమాదానికి మూల హేతువుగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం,స్టీల్ ప్లాట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్ ప్లాంట్ అధోగతికి దిగజారడామే కాక ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుందని ఉక్కు ఇంటెక్ అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ విల్లూరి మహాలక్ష్మి నాయుడు ఇతర నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు.
కర్మాగారంలో కార్మికులకు ఎలాంటి కనీస సదుపాయాలను కల్పించడం లేదని మంచినీరు టి స్నాక్స్ వంటివి కూడా అందుబాటులో ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద కారణాలపై
పూర్తిస్థాయిలో నిష్పక్షపాత దర్యాప్తు జరిపి మృతి చెందిన ఒక్కో కార్మికుడికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఇతరత్రా ఆదుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది
ప్రమాద వార్త వెలువడిన వెంటనే డ్యూటీలో ఉన్న కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మృదేహాలను బయటకు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి

